భారత జవాన్ల త్యాగాలు మరువలేనివి..

భారత జవాన్ల త్యాగాలు మరువలేనివి..
- డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్
పరకాల, ఆంధ్రప్రభ : భారత జవాన్ల త్యాగాలు మరువలేనివి అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ అన్నారు. దేశ పరిరక్షణ కోసం విధి నిర్వహణలో భాగంగా “పుల్వామ ఉగ్రదాడి”లో అసువులు బాసిన భారత జవాన్ల త్యాగాలు మరువలేనివి, వారి త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని డాక్టర్ సంతోష్ కుమార్ అన్నారు. భారత్ లో ఉగ్రదాడులు జరగకుండా ప్రధాని నరేంద్ర మోడీ భారత త్రివిధ దళాలకు రక్షణ సర్వ అధికారులు ఇవ్వడం జరిగిందన్నారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన భారత జవాన్లకు ఘన నివాళులు తెలుపుతున్నమని డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ తెలియజేశారు.
