వదంతులు నమ్మవద్దు…

- అవుకు రిజర్వాయరుపై ఎస్ఆర్బీసీ ఈఈ
ఆంధ్రప్రభ, అవుకు రూరల్, (నంద్యాల జిల్లా) నంద్యాల జిల్లా అవుకు మండలం లోని తిమ్మరాజు రిజర్వాయర్ కు ఎలాంటి ముప్పు లేదని ఎస్ఆర్బీసీ ఈఈ శుభకుమార్ శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ అవుకు రిజర్వాయర్ రివిట్ మెంట్ రెండు అడుగుల మేర గతంలో కుంగిన ప్రదేశంలోనే కట్ట కుంగిందన్నారు.
రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 4.148 టీఎంసీలు కాగ ప్రస్తుతం 3.62 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. గత ఏడాది కూడా 4 టీఎంసీల నీరు నిల్వ ఉంచామన్నారు.ఆ సమయంలో కూడా కొద్దిగా రిజర్వాయర్ కట్ట కుంగిన మాట వాస్తవమేనని, మరలా అదే ప్రదేశంలోనే నీటి ఉధృతి కారణంగా కొద్దిగా నీటి లీకేజీ జరిగిందన్నారు.
రిజర్వాయర్ ను నిర్మించినప్పటి నుండి సీపేజీ బయటకి వస్తుందన్నారు. నీటి నిల్వలు తగ్గించాలనే ఉద్దేశంతో గాలేరు నగరి కాలువకు మూడు గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కులు నీటి నిలువ నీటిని విడుదల చేశామన్నారు.
సాయంత్రం కల్లా రిజర్వాయర్ లో మూడు టీఎంసీల నీటిని ఉంచుతామన్నారు.ప్రజలెవరు ఆందోళన చెందవద్దని సూచించారు. కుంగిన ప్రదేశం వద్ద రిజర్వాయర్ కట్టకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరమ్మతులు చేపడుతున్నామన్నారు. ఘటన స్థలాన్ని జల వనరుల శాఖ అధికారులు ఎస్ఈ.రెడ్డి శేఖర్ రెడ్డి, ఈఈ శుభకుమార్, డిఈలు మల్లికార్జున రెడ్డి, సాయికిరణ్,జేఈలు సుధాకర్ పాల్గొన్నారు.
