7402acres | పప్పు ధాన్యాలతో లాభాలెన్నో…!

7402acres | పప్పు ధాన్యాలతో లాభాలెన్నో…!

7402acres | పప్పు దినుసుల్తో ఆరోగ్యానికి మంచిదంటున్న ఆరోగ్య నిపుణులు..
ప్రతి ఇంట్లో అందుబాటులో పప్పు దినుసులు..
సాగు తక్కువ… వాడకం ఎక్కువ..
పప్పు ధాన్యాలకు డిమాండ్ పెరిగేనా..?

అవుకు రూరల్,మార్చి8 (ఆంధ్రప్రభ) పప్పు దినుసులు అంటే ముందుగా గుర్తొచ్చేది కందులు,శనగలు, పెసలు,మినుములు, అలసందలు… వీటన్నిటిలో ప్రోటీన్లు,ఫైబర్ విటమిన్లు మరియు ఖనిజాలకు అద్భుతమైన వనరులు. పప్పు ధాన్యాలు బరువు,మధుమేహం నియంత్రణతో పాటు గుండె ఆరోగ్యం మరియు జీర్ణ క్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

7402acres
7402acres

ఆరోగ్య ప్రయోజనాలెన్నో :– ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బులను నియంత్రించడంలో పప్పు ధాన్యాలు ముందు వరుసలో ఉంటాయి.ఆకలిని తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరపరచడం ద్వారా మనిషి యొక్క బరువును తగ్గిస్తూ,చెడు కొలెస్ట్రాల్ ను,రక్తపు కొవ్వులను నియంత్రించడంలో సహాయపడతాయి.పప్పు దినుసులను వంటింట్లో ప్రతిరోజు వంటల్లో గృహిణులు వాడుతుంటారు.వీటిలో శరీరానికి కావాల్సిన మాంసకృతులు,ఫైబర్ అందించి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.వీటిని ముఖ్యంగా తూర్పు,దక్షిణ భారత వంటకాల్లో ప్రధాన భాగంగా పరిగణిస్తారు. విటమిన్ బి,ఐరన్ మరియు మెగ్నీషియం,ప్రోటీన్ కంటెంట్ వంటి పోషక ఖనిజాలు వీటిలో పుష్కలంగా లభిస్తాయని చెప్పవచ్చు.

వ్యవసాయాధికారిణి కలీ మున్నీసా
వ్యవసాయాధికారిణి కలీ మున్నీసా

మండలంలో సాగు అంతంత మాత్రమే :– అవుకు మండల వ్యాప్తంగా సుమారు 35 వేల ఎకరాల సాగు భూములు ఉన్నప్పటికీ పప్పు ధాన్యాల సాగును ఖరీఫ్ రబీ సీజన్లలో కలిపి 7402 ఎకరాలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయాధికారుల గణంకాలు చెబుతున్నాయి.పప్పు ధాన్యాల్లో అత్యధిక సాగు శనగ పంటను ఐదువేల ఎకరాల్లో (రబీలో) సాగు చేయగా,అత్యల్పంగా పెసర పంటను రబీ,ఖరీఫ్ సీజన్లో కలిపి కేవలం 22 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు అధికారుల నివేదికలు సూచిస్తున్నాయి.

కొన్ని ధాన్యాలకు డిమాండ్ :– మార్కెట్లో,శనగ ధాన్యానికి మినహా మిగతా పప్పు ధాన్యాలకు బాగానే డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.వీటికి డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

పప్పు ధాన్యాల సాగుకు అవగాహన కల్పిస్తున్నాం :– మండల వ్యాప్తంగా రైతులకు ఖరీఫ్ రబీ సీజన్లో పప్పు ధాన్యాల సాగు,దిగుబడులపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారిణి కలిమున్నీసా తెలిపారు.నల్ల రేగడి భూముల్లో వీటిని సాగు చేస్తే అధిక దిగుబడులు పొందవచ్చునని ఏవో సూచించారు.

వైద్యులు అభినయ్
వైద్యులు అభినయ్

పప్పు దినుసులు ఆరోగ్యానికి ఎంతో మంచిది:– పప్పు దినుసులను ప్రతిరోజు ఉదయం సమయంలో నానబెట్టి మొలకెత్తిన గింజలను తినడం వల్ల ప్రోటీన్స్,ఫైబర్ వంటి ఖనిజాలు అధికంగా అందుతాయి.వీటిని వాడటం వల్ల పలు రోగాలు దూరమవుతాయని అవుకు ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ వైద్యులు అభినయ్ సూచిస్తున్నారు. అంతేకాక మొలకెత్తిన పప్పు ధాన్యాలను తింటే డయాబెటిస్ అదుపులో ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు..

click here to read more

click here to read more health news

Leave a Reply