ఓటరు జాబితా సవరణలో నిర్లక్ష్యం వద్దు..
- బిఎల్ఓ లకు తహసీల్దార్ సూచన..
భూపాలపల్లి, ఆంధ్రప్రభ : ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ( సర్) నమోదు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన ఓటర్ల వివరాలను నమోదు చేయాలని భూపాలపల్లి తహసీల్దార్ లక్ష్మీరాజయ్య బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలు) సూచించారు. సోమవారం పట్టణంలోని జవహర్‌నగర్, కృష్ణకాలనీల్లో కొనసాగుతున్న సర్ నమోదు ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని వేగవంతం చేయాలని, ఆన్‌లైన్ డేటా ఎంట్రీ శాతం పెంచేందుకు ఎప్పటికప్పుడు వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి నమోదు ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు ఓటర్లకు అవసరమైన అవగాహన కల్పించి నిర్ణీత గడువులోగా సవరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో సూపర్వైజర్లు, బీఎల్ఓలు పాల్గొన్నారు.
