తల్లిదండ్రుల బాగోగులు చూడని బిడ్డలకు ఆస్తి అడిగే హక్కు ఉండదు…
తల్లిదండ్రుల బాగోగులు చూడని బిడ్డలకు ఆస్తి అడిగే హక్కు ఉండదు…
సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలుకు అవగాహన..
ఆర్ డి ఓ చల్లా విశ్వనాధ్…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : తల్లిదండ్రుల విలువ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని,చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసిన తల్లిదండ్రులను వారి సంతానం నిరాధారణ కు గురి చేస్తూ, మానసిక వేదనకు గురి చేస్తూ ఆస్తులు తీసుకొని వదిలివేసే వారికి సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తప్పవని నంద్యాల ఆర్ డి ఓ, సీనియర్ సిటిజన్ యాక్ట్ డివిజనల్ ట్రిబ్యునల్ చైర్మన్ చల్లా విశ్వనాధ్ పేర్కొన్నరు. మంగళవారం ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ ప్రతినిధులతో సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలు, అవగాహనపై సదస్సు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆర్ డి ఓ మాట్లాడుతూ తల్లిదండ్రుల బాగోగులు చూడని బిడ్డలకు వారి ఆస్తులు తీసుకునే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. కొందరు తల్లిదండ్రుల ఆస్తులు తీసుకొని వృద్దాప్యంలో రోడ్డున పడేస్తున్నారని, వృద్దాశ్రమాల్లో వదిలేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు ఉండి అనాధగా ఉంటున్న వృద్ధుల రక్షణ కోసమే ప్రభుత్వం సీనియర్ సిటిజన్ యాక్ట్ – 23 తెచ్చిందని, బిడ్డలకు ఆస్తులు బాధలయించే సమయంలో మా తదనంతరం మీకు మా ఆస్తిపై హక్కు అని తప్పనిసరిగా వ్రాయాలని ఆర్ డి ఓ కోరారు.
డాక్యుమెటరీ రైటర్స్ కూడా మీ వద్దకు వచ్చే వృద్ధులకు ఈ చిన్న అవగాహన కల్పించాలని, విశ్రాంత ఉద్యోగులు కూడా వృద్ధుల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఎక్కడైన వృద్ధులకు ఇలాంటి సమస్య ఉంటే వెంటనే నంద్యాల ఆర్ డి ఓ కార్యాలయంను సంప్రదించలన్నారు.సీనియర్ సిటిజన్ యాక్ట్ ట్రిబ్యునల్ ద్వారా న్యాయం చేస్తాం అన్నారు. ఈ అవగాహన సమావేశంలో నంద్యాల అర్బన్ తహసీల్దార్ పత్తి సత్య శ్రీనివాసులు,ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామసుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి మేకల. లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.
