Sangareddy | శారీరక దృఢత్వం కీల‌కం

Sangareddy | శారీరక దృఢత్వం కీల‌కం

క్రమశిక్షణతో విధులు నిర్వహించి మంచి పేరు తీసుకురావాలి
ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్ లో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్


Sangareddy | సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌ : పోలీస్ శాఖ‌ (Police Department) లో సిబ్బందికి శారీరక దృఢత్వం చాలా కీల‌కమ‌ని, క్రమశిక్షణతో విధులు నిర్వహించి పోలీసు శాఖ‌కు మంచి పేరు తీసుకురావాల‌ని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ (Paritosh Pankaj) అన్నారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఎస్పీ ఆదేశానుసారం ఆర్ముడ్ రిజర్వ్ పోలీసులకు జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో శారీరకంగా, మానసికంగా ఫిట్ గా ఉన్నప్పుడే ఎలాంటి పరిస్థితులలోనైనా సమర్ధవంతంగా విధులను నిర్వర్తించగలమ‌న్నారు.

జిల్లా ఆర్మూడ్ సిబ్బందితో పాటు సివిల్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రతి రోజు యోగా, వ్యాయామం చేస్తూ.. ఫిజికల్ ఫిట్ నెస్ (Physical fitness) ను కాపాడుకోవాలని అధికారులకు సూచించారు. అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అంకిత భావంతో పని చేయాలని, ఆయా స్టేషన్ పరిధిలో గల హిస్టరీ షీటర్ల గురించి పూర్తి అవగాహన కలిగి, నిఘా ఉంచాలన్నారు. గ్రామాల సంద‌ర్శ‌న‌లో భాగంగా మన చుట్టూ జరుగుతున్న ఆస్తి సంబంధిత, సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్స్, ట్రాఫిక్ రూల్స్, రోడ్డు ప్రమాదాలు, గురించి ప్రజల్లో కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

సిబ్బందికి, వ్యక్తిగత సమస్యలు, డ్యూటీ పరంగా ఎలాంటి సమస్య ఉన్నా.. అధికారుల దృష్టికి తీసుకురావలని అన్నారు. చెడు వ్యసనాలకు, స్నేహాలకు అలవాటు పడి, విధుల్లో నిర్లక్ష్యం వహించి, పోలీస్ శాఖ (Police Department) ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే, సహించేది లేదని, శాఖ పరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. పరేడ్ లో ఆర్.ఐలు శ్రీనివాస్ రావు, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, ఆర్.ఎస్ఐ లు డ్రిల్ ఇన్స్ట్రుక్టర్స్ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply