దుబాయ్ లో రేండ్లగూడ వాసి మృతి
- 11 రోజులకు ఇంటికి చేరిన మృతదేహం..
- కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
జన్నారం, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రేండ్లగూడకు చెందిన మంత్రి మహేష్(42) మృతదేహం బుధవారం మధ్యాహ్నం ఇంటికి చేరింది. కుటుంబ బాగుకోరి భార్య, పిల్లల భవిష్యత్తు కోసం దుబాయ్ కి వెళ్లిన మహేష్ గత నెల 29న అనారోగ్యంతో మృతి చెందినట్లు ధర్మారం గ్రామ గల్ఫ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మగ్గిడి తిరుపతి తెలిపారు.తాను ప్రత్యేక చొరవ తీసుకొని దుబాయ్ లో ఉన్న మంత్రి విజయ్ సహకారంతో సంబంధిత అధికారులతో, కంపెనీతో మాట్లాడి పార్థివ దేహాన్ని ఇంటికి తెప్పించామని ఆయన తెలిపారు. ప్రభుత్వం మృతుని కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
పార్థివ దేహం వద్ద కన్నీరు మున్నీరైనా కుటుంబ సభ్యులు..
ఇంటికి చేరిన మంత్రి మహేష్ మృతదేహం వద్ద భార్య మంత్రి ప్రేమలత,కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. డబ్బులు సంపాదించుకొని వచ్చి తమ జీవితాలను బాగు చేస్తాడని అనుకుంటే శవమై మృతదేహం వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహానికి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించినట్లు మాల మహానాడు మండల అధ్యక్షుడు దాముక కరుణాకర్,నేత బండ దేవేందర్ తెలిపారు. మృతుని కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోని , ఎక్స్ గ్రేషియా అందజేయాలని తెలంగాణ గల్ఫ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూమయ్య కోరారు.
