Siddipet | ఎస్ఎస్ టి శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్
Siddipet | ఎస్ఎస్ టి శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్
Siddipet | సిద్దిపేట జిల్లా, ములుగు, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని వంటిమామిడి రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేసిన ఎస్ఎస్ టి శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి హేమావతి (Hemavati) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం 24/7 ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తనిఖీ చేసే ప్రతి వీడియో రికార్డ్ చేయాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా అత్యంత పారదర్శకంగా ఎన్నికల విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటివరకు 96 వాహనాలను తనిఖీ చేసినట్లు పోలీస్ సిబ్బంది కలెక్టర్ (Collector) కు వివరించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్ లో కలెక్టర్ (Collector) సంతకం చేశారు. హనాలు తనిఖీ చేసే సమయంలో మిగతా వాహనాలకు ఇబ్బంది కలగకుండా రోడ్డు జామ్ కావడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
