chandrababu | గంటవానిపల్లెకు చేరుకున్న ముఖ్యమంత్రి.. ఘన స్వాగతం
ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులపై అధికారులతో సమీక్ష.. పురోగతిపై ఆరా
chandrababu |ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని గంటవానిపల్లెకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, ఎంపీ శ్రీనివాసులు రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ముఖ్యమంత్రి వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతి, నిర్మాణ నాణ్యత, పూర్తికి పట్టే గడువు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి, ప్రాజెక్టు లక్ష్యాలను సకాలంలో సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి, ప్రకాశం జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల రైతులకు ప్రయోజనం చేకూరనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
