ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలి

ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలి

డిజిటల్ అసిస్టెంట్లకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశం

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ డిజిటల్ అసిస్టెంట్లను ఆదేశించారు.

జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లతో ఆర్ఓఆర్ సేవలు, అర్జీలపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విధులకు సమయానికి హాజరుకావాలని సూచించారు. డిజిటల్ అసిస్టెంట్లకు డివిజన్ స్థాయిలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 30వ తేదీన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని, సంబంధిత డివిజన్‌లోని వారంతా తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.

సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న ఇంటర్నెట్ సహా ఇతర సమస్యలను అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, ఐవిఆర్ఎస్ ద్వారా వచ్చే కాల్స్ విషయంలో అర్జీదారులకు అవగాహన లోపంతో తప్పు బటన్ ప్రెస్ అవుతున్న సమస్యను వివరించారు. మ్యుటేషన్లు, రీ-సర్వేలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం లేకుండా ఖచ్చితంగా పరిశీలించి డిస్పోజ్ చేయాలని ఆయన తెలిపారు. మ్యుటేషన్ల పరిధిలోకి వచ్చే అంశాలను డిజిటల్ అసిస్టెంట్లకు వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటరామన్, జిల్లా పంచాయతీ అధికారి స్వరూపరాణి, సర్వే అండ్ ల్యాండ్ ఏడీ జోషిలా, డిజిటల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply