Ichchapuram | డయాలసిస్ కేంద్రం ప్రారంభం

ఇచ్ఛాపురం : ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి ఆవరణలో 5 పడకల కిడ్నీ డయాలసిస్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ ప్రారంభించారు. ఎమ్మెల్సీ నర్తు రామారావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.కళ్యాణ్ బాబుతో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.పి.దేవేంద్ర రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

అప్పట్లో పవన్ కళ్యాణ్ కిడ్నీ వ్యాధి తీవ్రతను వెలుగులోకి తీసుకువస్తే చంద్రబాబు వెంటనే స్పందించి కిడ్నీ రోగులకు పింఛన్లు, మందులు, శుద్ధ జలాలు అందించే బృహత్తర కార్యక్రమం చేపట్టినట్లు చెప్పుకొచ్చారు. అత్యవసర వైద్యం అందించే స్టేమీ యూనిట్, అధునాతన బయో కెమిస్ట్రీ ల్యాబరేటరీ, డయాలసిస్ కేంద్రంలో ఆర్ ఓ ప్లాంట్ ను ప్రారంభించారు. యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply