నేడు “డయల్ యువర్ డీఎం” కార్యక్రమం

నేడు “డయల్ యువర్ డీఎం” కార్యక్రమం
అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ పిఎండి ప్రసాద్
అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికుల సమస్యలు, సూచనలు తెలుసుకోవడానికి “డయల్ యువర్ డీఎం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ పిఎండి ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలు తెలిపారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రయాణికులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయడానికి 9440818849 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకుని సేవలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
