127thBirth Anniversary | అంతర్ముఖ శాంతి కోసం ఆధ్యాత్మిక మార్గం..

127thBirth Anniversary | అంతర్ముఖ శాంతి కోసం ఆధ్యాత్మిక మార్గం..

127 వ శ్రీరామచంద్ర (బాబుజీ) మహారాజ్ జయంతి ఉత్సవాలు కన్హాలో ఏప్రియల్ 29, 30. మే 1 2026 జరుగును
మానసిక సమతుల్యత ఆత్మ వికాసం కోసం ధ్యానం..

హార్ట్ ఫుల్ నెస్ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ..

127thBirth Anniversary | ఆంధ్ర‌ప్ర‌భ : సేవా భావంతో ప్రపంచవ్యాప్తంగా శిక్షణ అందిస్తున్న హార్ట్ ఫుల్ నెస్ సంస్థ లాభాపేక్షలేని, మతాతీత ఆధ్యాత్మిక సంస్థ తెలంగాణ రీజినల్ పెసిలిటేటర్ కొత్తపల్లి మధు ఎక్కువ కార్యకలాపాలను వాలంటీర్ ధ్యాన ట్రైనర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ద్వారానే నిర్వహిస్తారు. ధ్యాన శిక్షణ, సత్సంగాలు, కార్యక్రమాలు అన్నీ సేవాభావంతో చేసేవి వీరికి ఎలాంటి జీత భత్యలుండవు ఎన్నో జన్మల తర్వాత వచ్చిన మానవ జీవితం అనేక సమస్యలతో ఆందోళనతో జీవితం ముగించ కుండా ధ్యాన సాధన ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా కొత్త భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకొనే సువర్ణ అవకాశం కల్పిస్తోంది.హార్ట్ ఫుల్ నెస్ అనేది హృదయాన్ని కేంద్రంగా చేసుకున్న ధ్యాన విధానం. ఇది వ్యక్తి అంతర్ముఖ శాంతి, మానసిక సమతుల్యత, ఆత్మ వికాసం కోసం రూపొందించిన సార్వత్రిక ఆధ్యాత్మిక మార్గం. కులం, మతం, వయస్సు, లింగ భేదం లేకుండా అందరికీ అనుకూలం. అని భద్రాద్రి కోత్త గూడెం జోనల్ కో- అర్డినేటర్ అదిశేషు గారు అన్నారు

హార్ట్ ఫుల్ నెస్ అంటే ఏమిటి?

హార్ట్ ఫుల్ నెస్ అనేది హృదయంపై ధ్యానం ద్వారా మనసులో ఉన్న ఒత్తిడి, భయం, ఆందోళనలను తగ్గించి
శాంతి, స్పష్టత, ప్రేమ, వినయం వంటి విలువలను పెంపొందించే సాధన. ఇది కేవలం మనిషికి సంబంధించినది
ఇది మతపరమైన ఆచారం కాదు
ఇది శాస్త్రీయంగా ఆచరణలో పెట్టదగిన ధ్యాన విధానం అంతర్లీనంలో ఉన్న చెడు ఆలోచనలను శుభ్రపరిచి నూతన ఉత్తేజాన్ని ఇచ్చే గొప్ప సాధనం.

హార్ట్ ఫుల్ నెస్ లో 4 సాధనలు:

రిలాక్సేషన్..

శరీరాన్ని పూర్తిగా సడలించే సాధన
ఒత్తిడి, అలసట తగ్గుతుంది
ధ్యానానికి మనసు సిద్ధమవుతుంది

ధ్యానం

హృదయంపై కాంతి ఉందని భావిస్తూ ధ్యానం ఆలోచనలు తగ్గి అంతర్గత శాంతి తో పాటు దృష్టి, ఏకాగ్రత పెరుగుతుంది.

క్లీనింగ్ :

రోజంతా మనసులో చేరిన నెగటివ్(చెడు ఆలోచనలన) భావాలను తొలగించే సాధన మానసిక భారాన్ని తగ్గిస్తుంది
భావోద్వేగ సమతుల్యత పెరుగుతుంది.

ప్రార్థన :

నిద్రకు ముందు చేసే సాధన వినయం, కృతజ్ఞత, ఆత్మ పరిశీలన పెరుగుతాయి అంతర్ముఖ సంబంధాన్ని బలపరుస్తుంది.

-ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా ధ్యానం.
-శిక్షణ పొందిన ట్రైనర్లు (వాలంటీర్లు) ద్వారా మార్గదర్శనం.
-మొబైల్ యాప్ ద్వారా సాధన.
15 సం నిండిన వారందరూ , పెద్దలు అందరికీ అనుకూలం.
-రోజుకు 20–30 నిమిషాలు సాధన.
పాఠశాల, కళాశాల, ప్రభుత్వ, ప్రవేట్ సంస్థలు, ,ఆసుపత్రులు, వాణిజ్య కేంద్రాలలో ఉచితంగా ధ్యాన యోగా తరగతులు నిర్వహిస్తున్నారు.

కలిగే ప్రయోజనాలు:

మానసిక ఒత్తిడి తగ్గుతుంది
ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది
కోపం, ఆందోళన తగ్గుతాయి
నిర్ణయ సామర్థ్యం మెరుగవుతుంది
నిద్ర నాణ్యత పెరుగుతుంది
వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది
విద్యార్థులకు చదువులో ఏకాగ్రత
ఉద్యోగులకు స్ట్రెస్ మేనేజ్‌మెంట్
గృహిణులకు మానసిక ప్రశాంతత
యువతకు విలువలు, దిశ, క్రమ శిక్షణ
వృద్ధులకు అంతర్ముఖ శాంతి కలుగుతుంది.

ఉచిత ధ్యాన శిక్షణ:
హార్ట్ ఫుల్ నెస్ అనేది హృదయాన్ని కేంద్రంగా చేసుకున్న ధ్యాన విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసే ఆధ్యాత్మిక సంస్థ. ఇది వ్యక్తిగత శాంతి నుంచి సమాజ సంక్షేమం వరకు సమగ్ర వికాసాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ బి.బాలకృష్ణ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా సత్సంగాలు ధ్యాన శిబిరాలు చిన్న పిల్లలకు భగవద్గీత పారాయణం, యువత, మహిళలు వృద్ధులు, విద్యార్థుల కోసం ప్రత్యేక సెషన్లు పాఠశాలలు, కాలేజీల్లో విలువల ఆధారిత శిక్షణ, ప్రభుత్వ ,కార్పొరేట్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత ధ్యాన శిక్షణ ఇవ్వడం జరుగుతోంది..

బి ఆర్.టి వి రమణ

Leave a Reply