Dhootha 2 |సంచలన వెబ్ సిరీస్‌తో ప్రొడ్యూసర్‌గా..
Dhootha 2 | సంచలన వెబ్ సిరీస్‌తో ప్రొడ్యూసర్‌గా..
నిర్మాతగా టాలీవుడ్ స్టార్ హీరో
Dhootha 2 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ హీరోలు ఇప్పుడు నటులుగానే కాకుండా, చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగిడుతూ.. సరికోత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. ఇప్పుడు క్రమంలో సంచాలనత్మక వెబ్ సిరిస్ దూత 2 తో మరో టాలీవుడ్ హీరో నిర్మాతగా మారనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘దూత’, ఇప్పుడు రెండో అధ్యాయం కోసం సిద్ధమైంది.

నిర్మాతగా కొత్త ప్రస్థానం..
ఈ సిరీస్ రెండో సీజన్‌తో కీలక మార్పు చోటుచేసుకోనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒక స్టార్ హీరో తొలిసారిగా నిర్మాతగా అడుగుపెడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. “రెండవ అధ్యాయంలోకి అడుగుపెడుతున్న శుభ తరుణం, నిర్మాతగా నా మొదటి అడుగు” అని పేర్కొంటూ ఆయన తన ఉత్సాహాన్ని పంచుకున్నారు.

మ్యాజిక్ కోసం ఎదురుచూపులు
“ముందుకు, ఇంకా పైపైకి.. ముందున్న అద్భుత క్షణాలకు స్వాగతం!” అంటూ #Dhootha2 హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. మొదటి సీజన్ సృష్టించిన సంచలనం తర్వాత, రెండో సీజన్ ఏ స్థాయి మ్యాజిక్ చేయబోతుందో చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
మొదటి సీజన్లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘దూత’ వెబ్ సిరీస్ ఒక సరికొత్త అనుభవాన్ని అందించింది. ఇప్పుడు నిర్మాతగా మారిన ఈ స్టార్ హీరో నేతృత్వంలో రాబోతున్న రెండో సీజన్, అంతకు మించిన అంచనాలను అందుకోగలదని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

