13వ వార్డులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్

13వ వార్డులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్

ధర్మపురి, ఆంధ్రప్రభ:
ధర్మపురి పట్టణ అభివృద్ధిలో భాగంగా బుధవారం 13వ వార్డులో పలు నూతన డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల నిర్మాణ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, 13వ వార్డు కౌన్సిలర్ చీపిరిశెట్టి రాజేష్ కలిసి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.

చైర్‌పర్సన్ మాట్లాడుతూ, ఈ అభివృద్ధి పనుల ద్వారా వార్డు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి మున్సిపాలిటీ కట్టుబడి ఉందని, అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

కౌన్సిలర్ చీపిరిశెట్టి రాజేష్ మాట్లాడుతూ, 13వ వార్డు ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ పనులు ప్రారంభించామని తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన అన్నారు.

Leave a Reply