అమ్మవారి నిత్య అన్నదానానికి రూ.10 లక్షల విరాళం

-మంగళగిరికి చెందిన దంపతుల భారీ వితరణ

-ఆలయ చైర్మన్ బొర్రా గాంధీకి చెక్కు అందజేత

ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నిత్య అన్నదాన కార్యక్రమానికి భక్తులు మరోసారి ఉదారత చాటుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణయపాలెం గ్రామానికి చెందిన వై. జయశంకర్ కిషోర్ బాబు, మహాలక్ష్మి దంపతులు అమ్మవారిపై ఉన్న అపార భక్తిశ్రద్ధలతో నిత్య అన్నదాన విభాగానికి రూ.10,00,000 (పది లక్షల రూపాయలు) విరాళంగా సమర్పించారు. ఈ విరాళాన్ని ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) సమక్షంలో భక్తిపూర్వకంగా అందజేశారు. ఈ సందర్భంగా దంపతులు అమ్మవారి ఆశీస్సులతో సమాజ సేవలో భాగంగా అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా, వేద ఆశీర్వచనం అనంతరం చైర్మన్ బొర్రాగాంధీ అమ్మవారి చిత్రపటం రసీదు, ప్రసాదాలను అందజేశారు.