ఘనంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

ఘనంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

ప్రజా సంక్షేమానికి కట్టుబడిన నాయకుడు: పార్టీ నాయకుల ప్రశంసలు

కడెం, (ఆంధ్రప్రభ): తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను సోమవారం కడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భట్టి విక్రమార్క ప్రజల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రజానాయకుడని కొనియాడారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆయన అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఆయురారోగ్యాలతో మరిన్ని సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణం, ఆర్టీఏ సభ్యులు తుమ్మల మల్లేష్ యాదవ్, రాహుల్ గాంధీ ఫాలోవర్స్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు కమలాకర్, కాంగ్రెస్ నాయకులు జాడ రాజేశ్వర్, మ్యానం లక్ష్మణ్, తొట్ల ధర్మయ్య, తొట్ల గంగాధర్, దుర్గం లింగన్న తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *