డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం

డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం

పార్లమెంటులో రెండు బిల్లులను ఒకేసారి పెట్టడం మహిళలను ద్రోహం చేయడం

నందికొట్కూరు, ఆంధ్రప్రభ : డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు ఆరోపించారు, సోమవారం నందికొట్కూరు సిపిఎం పార్టీ కార్యాలయంలో సీపీఎం నాయకులు టి.గోపాలకృష్ణతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2023 లో ఆమోదించబడిన మహిళా రిజర్వేషన్ బిల్లు 2024 ఎన్నికల్లో అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కాలయాపన చేసి నేడు రాజకీయ లబ్ధి కోసం డీలిమిటేషన్ ద్వారా పార్లమెంటులో రెండు బిల్లులను ఒకేసారి పెట్టడం మహిళలను ద్రోహం చేయడం తప్ప మరొక కాదన్నారు, ఆంధ్ర రాష్ట్రానికి డీలిమిటేషన్ వల్ల అనేక సీట్లు కోల్పోతామని తెలిసినప్పటికీ రాష్ట్రంలోని టీడీపీ, వైసిపి , జనసేన,పార్టీలు బిల్లుకు సపోర్ట్ చేయడం విచారకరమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే డీలిమిటేషన్ అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఉన్న సీట్ల ఆధారంగా 50 శాతం పెంచి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్డీఏ మిత్ర పక్షాలతో చర్చించకుండానే, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడకుండా, రాజకీయ పార్టీల యొక్క సలహాలను సూచనలను తీసుకోకుండా మోడీ, అమిత్ షా ఆలోచన విధానంతో బిజెపి రాజకీయ లబ్ధి కోసం డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందని వారు ఆరోపించారు. నేడు బెంగాల్, తమిళనాడు, కేరళ, తదిత రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం రాజకీయ లబ్ధి కోసం తప్ప మరోటి కాదన్నారు, బీజేపీకి మహిళలపై చిత్తశుద్ధి ఉంటే మహిళలకు 33% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.