Delhi | వల్లభనేని బాలశౌరితో భేటీ..

Delhi | వల్లభనేని బాలశౌరితో భేటీ..

Delhi, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఢిల్లీలోని పార్లమెంట్ హల్ లోని సీఓఎస్ఎల్ ఛైర్మన్ కార్యాలయంలో కమిటీ చైర్మన్ బాలశౌరితో (Balasouri) నేషనల్ హై వే ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని రోడ్ల అభివృద్ధి గురించి, పోర్టుకు అనుసంధానంగా నిర్మించే రోడ్ల గురించి, విజయవాడ మచిలీపట్నం ఎన్హెచ్ 65 ను 4 నుండి 6 వరసలు రహదారి విస్తరణ పనుల గురించి, గుడివాడ, కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు గురించి, పెడన లక్ష్మీపురం రోడ్డు తదితర పనుల గురించి ఎన్హెచ్ఏఐ చైర్మన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇందుకు ఛైర్మన్ సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు పనులు త్వరగా పూర్తి అయ్యేలా ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply