London High Court | నీరవ్ మోడీ పిటిషన్ తిరస్కరణ
London High Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో నిందితుడైన నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్కు అప్పగింపును సవాలు చేస్తూ దాఖలు చేసిన అతని పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
నీరవ్ మోదీ తనను భారత్కు పంపించే ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను లండన్ హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది బలమైన వాదనలు వినిపించారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వేల కోట్ల రూపాయలను మోసగించి విదేశాలకు పరారైన కేసులో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్కు అప్పగింపు ప్రక్రియలో ఈ తీర్పు కీలక మలుపుగా మారింది.
