విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట…

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట…

ఘనంగా ఉమ్మడి యూత్ ఫెస్టివల్ వేడుకలు

ఉట్నూర్, ఆంధ్రప్రభ : విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వ ఆయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని పీఎంఆర్సి భవనంలో ఉమ్మడి జిల్లా యూత్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ… ప్రభుత్వ గురుకుల కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని నిధులు మంజూరు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నిధులు మంజూరు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. విద్యార్థులు కష్టపడి ఇష్టపడి ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అప్పుడే తల్లిదండ్రుల కలలు సహకారం అవుతాయని అన్నారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా బొజ్జు పటేల్‌కు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ ప్రొఫెసర్ అధ్యాపకులు మెమొంటో అందించి శాలువతో ఘన సన్మానం చేశారు.

ఈ వేడుకల్లో కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కె ప్రతాపరెడ్డి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ నారాయణ ఉట్నూర్ ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయిప్రసాద్ ఎన్ ఎస్ ఎస్ సి యూనిట్ కోఆర్డినేటర్ రాజశేఖర్ డాక్టర్ రవీందర్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ అధికారితో పాటు అధ్యాపకులు వక్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.