Dandepalli | వైభవంగా మార్కండేయ జయంతి వేడుకలు

Dandepalli | వైభవంగా మార్కండేయ జయంతి వేడుకలు
Dandepalli | దండేపల్లి, ఆంధ్రప్రభ : పద్మశాలి కులబంధువుల ఆరాధ్య దైవమైన మార్కండేయస్వామి మహర్షి జయంతి వేడుకలను పురస్కరించుకొని దండేపల్లిలో పద్మశాలి సంఘ భవనంలో ఈ రోజు మార్కండేయ స్వామి జయంతి వేడుకల నాయకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయ చిత్రపటానికి పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు వంగ శంకరయ్య, పట్టణ అధ్యక్షులు వోడ్నాల శంకర్ పూలమాల వేశారు. ముందుగా ఆలయంలో అర్చకుడు బ్రహ్మా శ్రీ సాంబారి కిషన్ శాస్త్రి మార్కండేస్వామికి మహారుద్రభిషేకంతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించగా, పద్మశాలి కులబందువులు పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం పటణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు వోడ్నాల శంకర్ మార్కండేయ పతాకాన్ని ఆవిష్కరించి నూతనంగా గెలుపొందిన స్థానిక సర్పంచ్ అజ్మీరా రాజేశ్వర్ నాయక్, ఉప సర్పంచ్ సిరికొండ నవీన్ మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ లను చాలువలతో సన్మానించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం మహిళ రాష్ట్ర కార్యదర్శి కట్ల మంగ, సంఘం గౌరవాధ్యక్షులు ఎనగందుల దుబ్బయ్య, మాజీ మండల అధ్యక్షులు వడ్డేపల్లి దేవయ్య, సర్గం శంకరయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఎనగందుల సత్యం, కోశాధికారి సాంబారి కిషన్, నాయకులు శంకరయ్య, లక్ష్మణ్, శ్రీనివాస్, సత్తయ్య, రమేష్, మహేందర్, చామంతి, రాజ్ కుమార్, సత్యం, శ్రీనివాస్ తిరుపతి, దేవేందర్, శంకరయ్య, శంకరవ్వ, రత్నమాల, ఉమాశ్రీ, పద్మ తదితరులు పాల్గొన్నారు.
