MODI | పొంగలి వండిన ప్రధాని మోడీ
MODI | పొంగలి వండిన ప్రధాని మోడీ
MODI | ఢిల్లీ, ఆంధ్రప్రభ : పొంగల్ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ తమిళ సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం తెలిపారు. ఢిల్లీలోని (Delhi) కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ నివాసంలో ఏర్పాటు చేసిన పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ పూజా కార్యక్రమాలు నిర్వహించి, స్వయంగా పొంగలి వండి, గోవులకు పూజ చేశారు. అలాగే ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
