మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన
- కమ్మర్ పల్లి ఎస్ఐ సీహెచ్ సతీష్
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ: మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని కమ్మర్ పల్లి ఎస్ఐ సీహెచ్ సతీష్ అన్నారు. సోమవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కమ్మర్ పల్లి ఎస్ఐ సతీష్ మాదక ద్రవ్యాల నివారణకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణమాలు గురించి, యువత వాటికి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. డ్రగ్స్‌కు బానిస కావడంతో జీవితం, కుటుంబాలు ఎలా దెబ్బతింటాయో విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్య రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామ సర్పంచ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

