వల్లంపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత
SCHOOL | ఊట్కూర్, ఆంధ్రప్రభ : సర్కార్ బడుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వల్లంపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని వల్లంపల్లి గ్రామానికి చెందిన మన్నె చంద్రశేఖర్ తన కుమారుడి జన్మదినం సందర్భంగా పాఠశాల అభివృద్ధికి నగదు వితరణ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేపట్టడంతో పాటు దుస్తులు, సన్నబియ్యంతో భోజనం, పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. పాఠశాలల అభివృద్ధికి గ్రామ ప్రజలు సహకరిస్తే విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అభిజయ్ పుట్టినరోజు పురస్కరించుకొని రూ. 2001 పాఠశాల అభివృద్ధికి సహాయం చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం శశిధర్ రెడ్డి, సత్యపాల్, ఇందిరా దేవి తదితరులు పాల్గొన్నారు.

