Tippiri Tirupathi Devji I మావోయిస్టు జీవితం వీడి.. న్యాయవాదిగా మారాలనే కలతో ముందుకు..

Tippiri Tirupathi Devji I మావోయిస్టు జీవితం వీడి.. న్యాయవాదిగా మారాలనే కలతో ముందుకు..

Tippiri Tirupathi Devji I ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ప్రతీ ఒక్కరి జీవితంలో మార్పు రావడం సహజం కానీ దానికి వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు. వారి గతం ఎంత కఠినంగా ఉన్నా.. కొత్త దారిని ఎంచుకోవాలనే ఆలోచన, ధైర్యం ఉంటే భవిష్యత్తుక కొత్త బాటలు వేయచ్చని మాజీ మావోయిస్ట్ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ మరోసారి నిరూపించారు. గన్ను పట్టిన చేతితోనే.. ఇప్పుడు పెన్ను పట్టి పరీక్ష రాసి ఇంటర్‌లో పాస్ కావడం చర్చనీయాంశంగా మారింది.

మధ్యలో ఆపేసిన చదువును పూర్తి చేయాలనే ఆలోచన అందరికీ రాదు, వచ్చిన కొందరికి ఆచరణలో పెట్టడం సాధ్యం కాదు. కానీ దేవ్‌జీ ఆపేసిన చదువును పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ మధ్యే జరిగాన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష రాశారు. విద్యాశాఖ, ఉన్నతాధికారుల ప్రత్యేక అనుమతితో ఇంటర్ సెకండియర్ తెలుగు పరీక్షకు హాజరై పరీక్ష రాశారు. అయితే నేడు వెలువడిన ఫలితాల్లో ఆయనకు తెలుగు పరీక్షలో 72 మార్కులు రావడంతో పాసయ్యారు. ఆయన మొత్తం ఇంటర్‌లో 614 మార్కులు సాధించినట్లు సమాచారం.

Tippiri Tirupathi Devji I 40 ఏళ్ల తర్వాత పరీక్ష హాల్‌లోకి..

దేవ్‌జీ స్వస్థలం జగిత్యాల జిల్లా. ఆయన కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న సమయంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌తో అనుబంధం ఏర్పడింది. ఆ కాలంనాటి సిద్ధంతాలు, నిర్ణయాలు ఆయనను మరో దారిలోకి తీసుకెళ్లాయి. దీంతో 1983-86 మధ్యకాలంలో మావోయిస్టు ఉద్యమంలో చేరారు. ఆ తర్వాత దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అండర్‌గ్రౌండ్‌లో ఉండి, సీపీఐ (మావోయిస్టు)లో అగ్రనేత స్థాయికి ఎదిగారు. 2026 ఫిబ్రవరిలో లొంగిపోయి తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చారు.

Tippiri Tirupathi Devji

నాలుగు దశాబ్దాల క్రితం అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆయన చదువు ఆగిపోయింది. ఆ కాలంనాటి సిద్ధంతాలు, నిర్ణయాలు ఆయనను మరో దారిలోకి తీసుకెళ్లాయి. అయితే ఏం ఇప్పుడు ఆయుధాల మార్గాన్ని వదిలి, విద్య ద్వారానే జీవితాన్ని కొత్తగా మలుచుకోవాలనే ప్రయత్నం మొదలు పెట్టాడు. 2026లో ఇంటర్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో తెలుగు పేపర్ రాసినట్లు మీడియా కూడా గతంలో రిపోర్ట్ చేయడంతో ఈ విషయం సామాజిక మాధ్యమంలో వైరల్‌ గా మారింది.

Tippiri Tirupathi Devji

న్యాయ విద్య చదవాలనే లక్ష్యంతో ముందుకు సాగిన దేవ్‌జీ ఇటీవల లాసెట్‌లో 349వ ర్యాంక్ సాధించడం మరో విశేషం. ఒకప్పుడు చట్టానికి వ్యతిరేకమైన మార్గంలో నడిచిన వ్యక్తి.. ఇప్పుడు అదే చట్టాన్ని చదివి, సమాజంలో కొత్త పాత్ర పోషించాడానికి సిధ్దమయ్యారు.

Tippiri Tirupathi Devji I గన్ను కాదు.. పెన్నే భవిష్యత్తు

దేవ్‌జీ స్పూర్తి ఈ సమాజంలో మార్పు కోసం హింస కాదు, విద్యే సరైన మార్గమని గుర్తుచేస్తోంది. గన్ను భయం కలిగించొచ్చు. కానీ పెన్ను భవిష్యత్తును నిర్మిస్తుంది. దేవ్‌జీ ఇప్పుడు ఎంచుకున్న దారి అదే. అందుకే ఈ కథ ఒక వ్యక్తి విజయగాథ మాత్రమే కాదు.. మార్పు కోరుకునే ప్రతి ఒక్కరికీ ఒక స్ఫూర్తి.

ఆయన తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందినవారు. కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న సమయంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌తో అనుబంధం ఏర్పడి, 1983-86 మధ్యకాలంలో మావోయిస్టు ఉద్యమంలో చేరారు. ఆ తర్వాత దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అండర్‌గ్రౌండ్‌లో ఉండి, సీపీఐ (మావోయిస్టు)లో అగ్రనేత స్థాయికి ఎదిగారు. 2026 ఫిబ్రవరిలో లొంగిపోయి తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చారు. ప్రస్తుతం న్యాయ విద్య చదివి పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

click here for read more : 349thRank | విద్యార్థిగా మారిన దేవ్ జీ..

Leave a Reply