ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం…

ఆలేరు, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యలపై తమ పార్టీ నిరంతర పోరాటాలను నిర్వహిస్తున్నదని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల బిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ రచ్చ రాం నరసయ్య మంగళవారం చెప్పారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవలసిన బాధ్యత పాలక కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉందని ఆయన తెలిపారు. ప్రజల ఆదరణతో బిఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం ఖాయమని ఆయన చెప్పారు.