కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం

కడెం, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో గర్భిణీ మహిళలకు గైనకాలజిస్ట్, స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ స్వర్ణ రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు అందజేశారు. అలాగే పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ పి. సాయి కృష్ణ చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సామాజికవేత్త సిహెచ్ రాజేష్ కుమార్, కడెం ప్రభుత్వ ఆసుపత్రి ఏఎన్‌ఎంలు, ఆసుపత్రి సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
