1వ వార్డ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నరేందర్ ఎన్నిక
1వ వార్డ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నరేందర్ ఎన్నిక
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎలుగల నరేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు పూల సత్తయ్య, రసూల్, ద్వారపు శంకర్, తాడెం యాదగిరి, మానుపాటి వెంకటేష్, శేఖర్, రాజు, బాబా, రాజేష్, భాను పాల్గొన్నారు.
