బుద్ధ విహార్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

ఎమ్మెల్యేకు వినతి అందజేసిన ముఖ్రా బి గ్రామస్థులు

ఇచ్చోడ, ఆంధ్రప్రభ: ఇచ్చొడ మండలంలోని ముఖ్రా బి గ్రామస్తులు సోమవారం రోజున ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మాణంలో ఉన్న బుద్ధ విహార్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నజీర్, ముఖ్రా కె మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.