Sankranti | సమాజాన్ని చైతన్య పరచడమే లక్ష్యం..
Sankranti | సమాజాన్ని చైతన్య పరచడమే లక్ష్యం..
Sankranti, కుంటాల, ఆంధ్రప్రభ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాన్ని నిర్వహించారు. వక్తగా హాజరైన జిల్లా ప్రచార ప్రముఖ్ వంగల సుధాకర్ గురువారం మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో సంక్రాంతి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది ఐక్యత సేవాభావాలను గుర్తు చేసే మహాపర్వదినం. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ఈ పవిత్ర సందర్భం మన జీవితాల్లో కూడా సకారాత్మక మార్పు రావాలని సూచిస్తుంది అని అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆరంభం నుంచీ వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతి నిర్మాణం అనే సూత్రాన్ని అనుసరిస్తోందని మన దేశం బలంగా ఉండాలంటే.. మన గ్రామం బలంగా ఉండాలి.
మన గ్రామం బలంగా ఉండాలంటే.. ప్రతి వ్యక్తి కర్తవ్యనిష్ఠతో, దేశభక్తితో ముందుకు రావాలి. సంక్రాంతి పండుగ మనకు రైతుల కష్టాన్ని గుర్తు చేస్తుంది. రైతు శ్రమను మన సంప్రదాయాలను కాపాడుకోవడం, మన సంస్కృతిని తరతరాలకు అందించడం మన బాధ్యతగా.. మనమంతా సంకల్పం చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా గో సేవా ప్రముఖ్ కొత్తకాపు నారాయణ, సర్పంచ్ జక్కుల గజేందర్, ఉప సర్పంచ్ వెంకట రమణ, తాటి శివ, రాజ్ కుమార్, రాజు, నవీన్, నరేందర్, గజేందర్ స్వయం సేవకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
