Congress Govt | ఈ బిల్లు వారికి గుణపాఠం…

Congress Govt | ఈ బిల్లు వారికి గుణపాఠం…
Congress Govt | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల జవాబుదారీతనం బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. ఈ బిల్లును శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి జీతంలో 15 శాతం కోత విధించేలా ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ప్రేమతో కాకపోయినా భయంతోనైనా తల్లిదండ్రులను పిల్లలు చూసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కుటుంబ వ్యవస్థల్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో పెద్దలను నిర్లక్ష్యం చేసే ఘటనలు ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్నాయి.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం “పర్యవేక్షణ బిల్లు-2026″ను తీసుకువచ్చిందని సీఎం తెలిపారు. ఈ బిల్లు ద్వారా ఉద్యోగులు తమ తల్లిదండ్రులను సంరక్షించకపోతే, వారి వేతనం నుంచి ఒక భాగాన్ని నేరుగా తల్లిదండ్రులకు అందించే విధానం అమల్లోకి రానుంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఉంటారని తెలిపారు. ఈ చట్టం తల్లిదండ్రులను పట్టించుకోనివారికి గుణపాఠంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
