AP | బుద్దా వెంకన్న గృహనిర్బంధం…
వైసీపీ దీక్షా శిబిరానికి వెళ్లకుండా బుద్దా వెంకన్న గృహ నిర్బంధం
వెంకన్న నివాసానికి చేరుకున్న డీసీపీ రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సీఐ గున్రామ్
AP | విజయవాడ, ఆగస్టు 7( ఆంధ్రప్రభ): విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ బుద్దా వెంకన్నను పోలీసులు శుక్రవారం గృహ నిర్బంధం చేశారు. వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు చేపట్టిన దీక్షా శిబిరం వద్దకు వెళ్లకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
బుద్దా వెంకన్న నివాసానికి డీసీపీ రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సీఐ గున్రామ్ తదితర పోలీసు అధికారులు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే గృహ నిర్బంధం చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ పరిణామంతో వెంకన్న నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించగా, రాజకీయంగా ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై అధికారికంగా బుద్దా వెంకన్న స్పందించాల్సి ఉంది.
