Pharma Labs | రియాక్టర్ బ్లాస్ట్‌తో 9 మందికి తీవ్ర గాయాలు
Pharma Labs | రియాక్టర్ బ్లాస్ట్‌తో 9 మందికి తీవ్ర గాయాలు
Pharma Labs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లాలోని నోష్ ఫార్మా ల్యాబ్‌లో మరోసారి పేలుడు ఘటన చోటుచేసుకుంది. రియాక్టర్ పేలిపోవడంతో 9 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామ పరిధిలో ఉన్న ఫార్మా ల్యాబ్‌లో జరిగింది. అకస్మాత్తుగా రియాక్టర్ పేలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు గాయపడ్డారు. ఘటనతో పరిశ్రమలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న అధికారులు, సహాయక బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
గత నెల 9వ తేదీన కూడా ఇదే ఫ్యాక్టరీ రెండో బ్లాక్‌లో రియాక్టర్ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
