Congress | గెలుపు కోసం..

Congress | గెలుపు కోసం..
Congress, బోధన్, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని నిజామాబాద్ (Nizamabad) కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సూచించారు. రుద్రూర్ గ్రామంలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఓటర్ కు అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు. రుద్రూర్ గ్రామoలో సర్పంచ్ గా వసంత సంజీవ్ రెడ్డిని గెలిపించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్ పీటీసీ గoగారాం, విండో మాజీ అధ్యక్షులు పత్తి రాము తదితరులు పాల్గొన్నారు.
