సర్వే పొరపాట్లు సరిచేయాలని ఎంపీడీవోకు వినతి
సర్వే పొరపాట్లు సరిచేయాలని ఎంపీడీవోకు వినతి
ఊట్కూర్, ఆంధ్రప్రభ: ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన ఇంటింటి సర్వేలో అధికారులు చేపట్టిన పొరపాట్లను సరిచేసి అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని నారాయణపేట జిల్లా ఊట్కూర్ ఎంపీడీవో కిషోర్ కుమార్ కు పెద్దపోర్ల మాస్ పార్టీ నాయకులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. పెద్దపోర్ల గ్రామంలో ప్రజా పాలన సర్వేలో అధికారులు ఇందిరమ్మ ఇండ్ల కోసం పలువురు ప్రజలు దరఖాస్తు చేసుకోగా అధికారులు సర్వే జాబితాలో ఎల్3, అనర్హులని పెండింగ్ చూపిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజా పాలన సర్వేలో జరిగిన పొరపాట్ల వల్ల అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా జాబితాలో ఎల్, 3 నుండి యల్ 1 జాబితాలోకి పేర్లు మార్పించి పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే విధంగాచూడాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీడీవో కిషోర్ కుమార్ మాట్లాడుతూ… ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూస్తానని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలోమాస్ లైన్ పార్టీ గ్రామ కార్యదర్శి కోళ్ల కృష్ణయ్య డివిజన్ నాయకుడు సి అంజప్ప గ్రామ సీనియర్ నాయకుడు తుంగ లింగప్ప చిన్న బాలు వార్డ్ నెంబర్ సురేష్,కాంగ్రెస్ నాయకులు మాలి అంజి కొత్త గుడిసె నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
