టీమిండియాకు దేవినేని అభినందనలు..

టీమిండియాకు దేవినేని అభినందనలు..

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టుకు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఉత్కంఠభరితంగా సాగిన తుదిపోరులో భారత ఆటగాళ్లు చూపిన ప్రతిభా పాటవాలు దేశాన్ని గర్వపడేలా చేశాయని పేర్కొన్నారు. మూడోసారి టీ20 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకోవడం భారత క్రికెట్ చరిత్రలో గొప్ప మైలురాయిగా నిలిచిందన్నారు.

క్రీడాస్ఫూర్తి, పట్టుదల, జట్టు సమన్వయంతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని భారత జట్టు మరోసారి ప్రపంచానికి నిరూపించిందని తెలిపారు. టీమిండియా సాధించిన ఈ విజయం దేశ వ్యాప్తంగా కోట్లాది క్రికెట్ అభిమానులకు గర్వకారణమని దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. భారత జట్టు భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలను సాధిస్తూ ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.