బాధిత కుటుంబానికి పరామర్శ

బాధిత కుటుంబానికి పరామర్శ

రాయపర్తి, ఆంధ్రప్రభ : మండలంలోని మైలారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిర్ర దర్గయ్య అనారోగ్యంతో మరణించగా, మంగళవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనల మేరకు మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్.. పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఆయన వెంట గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎలమంచి శ్రీనివాసరెడ్డి, మండల నాయకుడు లేతకుల రంగారెడ్డి, వార్డు సభ్యులు పరుపాటి రవీందర్ రెడ్డి, గాడిపెల్లి రాములు, పార్టీ ముఖ్య నాయకులు గుడెల్లి వెంకటయ్య, సంధి దేవేందర్ రెడ్డి, గబ్బేట కొమురయ్య, సంకినేని ఎల్లస్వామి, చిర్ర రవి, బచ్చలి యాకయ్య తదితరులు పాల్గొని దర్గయ్య మృతికి సంతాపం తెలిపారు.