Sruthi hassan | నిర్ణయం మార్చుకుందా..?

Sruthi hassan | నిర్ణయం మార్చుకుందా..?
Sruthi hassan | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అందాల శృతి హాసన్.. ఒకప్పుడు ఐరన్ లెగ్ అనేవారు.. ఆతర్వాత గోల్డెన్ లెగ్ అన్నారు. ఈ అమ్మడు సినిమాలో నటిస్తే.. ఆ సినిమా బ్లాక్ బస్టరే అనే పేరు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. శృతి రెండు సార్లు బ్రేకప్ (Breakup) అయిన తర్వాత ఇక పెళ్లి చేసుకోను.. సింగిల్ గానే ఉంటాను అనేట్టుగా మాట్లాడేది. ఇప్పుడు పెళ్లికి రెడీ అంటూ షాక్ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. మరి.. శృతి పెళ్లికి రెడీ అనడం అనేది నిజమేనా..? లేక గాసిప్పా..?
Sruthi hassan | రెండు సార్లు బ్రేకప్..
సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ పెళ్లి గురించి మరోసారి చర్చ మొదలైంది. గతంలో రెండు బ్రేకప్స్ అయిన తర్వాత ఇప్పుడు ఆమె వివాహానికి సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఆమె తండ్రి కమల్ కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే టాక్ (Talk) ఇండస్ట్రీలో వినిపిస్తుంది. దీంతో శృతి మ్యారేజ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శృతి హాసన్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. గతంలో ఆమెకు రెండు సార్లు బ్రేకప్ జరగడంతో.. పెళ్లికి నో అని.. సింగిల్ గా ఉంటేనే బాగుంటుందని గతంలో చెప్పింది.

Sruthi hassan | పెళ్లి సంబంధాలు చూస్తున్న కమల్..?
ఇప్పుడు పెళ్లికి రెడీ అనడం ఆసక్తిగా మారింది. ఇది నిజమేనా అంటే.. నిజమే అనేట్టుగానే ప్రచారం జరుగుతుంది. ఇటీవల కమల్ కూడా శృతి కోసం సంబంధాలు చూడడం మొదలుపెట్టారని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై శృతి హాసన్ (Sruthi Hassan) నుంచి కానీ.. కమల్ హాసన్ నుంచి కానీ.. ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ఇవి కేవలం ఊహాగానాలే అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. శృతి సలార్ 2 లో నటించారు. ఈ ఇయర్ ఎండింగ్ లో సలార్ 2 సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.

Sruthi hassan | అందుకే.. ఈ నిర్ణయం..
ఆమె కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అనగనగా ఓ ధీరుడు, 3, ఓ మై ఫ్రెండ్.. ఇలా వరుసగా సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసేసారు. అలాంటి టైమ్ లో హరీష్ శంకర్.. గబ్బర్ సింగ్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జంటగా శృతి నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. అక్కడ నుంచి ఆమె దశ తిరిగింది. వరుసగా ఆఫర్స్ రావడం.. ఆ సినిమాలు (Movies) బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో.. ఐరెన్ లెగ్ కాస్తా గోల్డెన్ లెగ్ అయ్యింది. ఇప్పుడు పర్సనల్ లైఫ్ పై ఫోకస్ పెట్టి మ్యారేజ్ చేసుకోవాలి.. సెటిల్ అవ్వాలి అనుకుంటుంది అనుకుంటా.. అందుకే ఈ నిర్ణయం తీసుకుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మరి.. ప్రచారంలో ఉన్న పెళ్లి వార్తల పై శృతి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

