ఎమ్మెల్యే వేముల సహకారంతో మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి

చిట్యాల, ఆంధ్రప్రభ : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో చిట్యాల మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చిట్యాల మున్సిపల్ నూతన చైర్మన్ పందిరి గీత అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యచరణలో భాగంగా శనివారం ప్రగతి ప్రణాళిక చిట్యాల పురపాలక పరిధిలోని 4, 5వ వార్డులో స్పెషల్ ఆఫీసర్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన రవిశంకర్ కమిషనర్ దండు శ్రీను వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి, పాలకవర్గంతో కలిసి రెండో రోజు ప్రారంభించారు.
అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. పట్టణాల సమగ్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్మన్ పందిరి గీత పిలుపునిచ్చారు. స్పెషల్ ఆఫీసర్ రవిశంకర్ నూతనంగా ఎన్నికైన పాలకవర్గం తోటి పారిశుద్ధ కార్మికుల చేత పట్టణ పరిశుభ్రత అభివృద్ధిపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ పందిరి గీత మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మంత్రి మండల చైర్మన్ అందరి సహకారంతో చిట్యాల పట్టణాన్ని అభివృద్ధిలో నడిపిస్తామని స్వచ్ఛ చిట్యాల సాధనకై శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు.
వైస్ చైర్మన్, గుండెబోయిన బోయిన శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. వేగంగా విస్తరిస్తున్న చిట్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత మనందరిపై ఉందని అధికారులు సిబ్బంది ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ తమ తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కోరారు అనంతరం చైర్మన్ పందిరి గీత చీపురు పట్టుకొని చెత్తను తొలగించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
