కాపాడండి.. మహాప్రభో..

కాపాడండి.. మహాప్రభో..

తాడ్వాయి, ఆంధ్రప్రభ – అరుగలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన సమయం లో అడవి పందులు వరి పంటను నాశనం చేశాయి. ఒక్క పక్క ప్రకృతి అనావృష్టి అతివృస్థి సృటించి రైతులను నిండా ముంచుతున్నాయి. మరోపక్క అడవి పందులు వరి పంటను విధ్వంసం చేయడంతో రైతులు ఆందోళన చెండుతున్నారు. తాడ్వాయి మండలo నర్సింగాపూర్ గ్రామానికి చెందిన చింతల ఐలయ్య రైతు వరి పంటను సోమవారం రాత్రి పందులు పాడుచేశాయని ఆందోళన చెండుతున్నారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. అడవి జంతువుల నుంచి రైతులు వేసిన పంటలను కాపాడాలని.. సంబంధించిన అధికారులును రైతులు కోరుతున్నారు.

Leave a Reply