Polling booths | దివ్యాంగులకు వసతులు కల్పించాలి..

Polling booths | దివ్యాంగులకు వసతులు కల్పించాలి..

Polling booths | ఊట్కూర్, ఆంధ్రప్రభ : మూడో విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ బూతుల్లో(Polling booths) దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలని నారాయణపేట దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఖాన్ ఈ రోజు విజ్ఞప్తి చేశారు. పోలింగ్ బూత్ బూతుల దగ్గర ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేయాలన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని, దివ్యాంగులు పోలింగ్ కేంద్రంలో(polling stations)కి వెళ్లి సునాయాసంగా ఓటు వేసేందుకు వసతులు కల్పించాలని కోరారు. చూపులేని అంధులను పోలింగ్ కేంద్రంలోకి తీసుకువెళ్లేందుకు ఎస్కార్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.