అక్కడ ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం
అక్కడ ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం
ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు : ఒంగోలు జిల్లా కలెక్టర్ రాజాబాబు (Collector Raja Babu) సమర్థవంతంగా తమ విధులను నిర్వహిస్తూ.. అందరితో అభినందనలు అందుకుంటున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన స్వయంగా పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ నష్ట నివారణకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఒంగోలులోని బిలాల్ నగర్, కరుణ కాలనీ తదితర కాలనీల్లో వరదలోను ట్రాక్టర్ పై వెళ్లి పరిస్థితులు గమనిస్తూ.. నేనున్నానంటూ అందరికీ భరోసా కల్పించడం గమనార్హం. ఇదిలా ఉండగా తుఫాన్ ప్రభావంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

ముసి పాలేరు నల్లవాగు (Paleru Nallavagu) ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. గుండ్లకమ్మ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈనెల 21వ తేదీ నుండి 29వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిసాయి. ప్రధానంగా ఒంగోలు అర్బన్ ఒంగోలు రూరల్ ప్రాంతాల్లో 59.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. కొత్తపట్నం మండలంలో 498 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. సింగరాయకొండ కొండేపి టంగుటూరు మండలాల్లో కూడా భారీ వర్షపాతం నమోదయింది. భారీగా పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. తుఫాన్ తీరం దాటడంతో అన్ని వర్గాల ప్రజలతో పాటు జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
