ఉపసర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి..

ఉపసర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి..

  • కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర కాంత్ రెడ్డి

బిక్కనూరు, ఆంధ్రప్రభ : ఉప సర్పంచ్ ల సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర కాంత్ రెడ్డి చెప్పారు. మండలంలోని రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి వినోద్ కుమార్ గౌడ్ ఇటీవల మండల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఆయనను చంద్రకాంత్ రెడ్డి శాలువాలతో సత్కరించి అభినందించారు.

అనంతరం మాట్లాడుతూ.. ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సేవలు చేయాలని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. అట్టి పథకాలను ప్రజలకు అందే విధంగా చూడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఎంతైనా ఉందన్నారు. మండలంలో ఉన్న ఉప సర్పంచు లందరూ ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో నాయకులు రాజు, శశి కుమార్ పంచాయతీ కార్యదర్శి శ్యామ్ ఉన్నారు.