రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు వినతిపత్రం

కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు శుక్రవారం పలువురు ప్రజాప్రతినిధులు నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాను కలిసి రైతుల సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందజేశారు.

ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్, పాండవపూర్ పీఏసీఎస్ చైర్మన్ రామడుగు శైలజ-రమేష్ రావు, సర్పంచుల ఫోరం కడెం మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్ గుప్తా, దస్తూరాబాద్ మండలం రేవోజిపేట్ గ్రామ సర్పంచ్ కోల మహేష్, బుట్టాపూర్ గ్రామ సర్పంచ్ గుండ నరేష్ తదితరులు కలెక్టర్‌ను కలిసి సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖానాపూర్, పెంబి, కడెం, దస్తూరాబాద్ మండలాల్లోని మక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

అలాగే ఆయా మండలాల్లో ఉన్న గోదాములను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అనంతరం ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు.

Leave a Reply