2028 టీ20 ప్రపంచకప్‌కు భారీ పోటీ

  • ఆతిథ్యం కోసం 14 నగరాల ఆసక్తి
  • 8 నుంచి 10 వేదికలకే ఐసీసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం

ఆంధ్రప్రభ : టీ20 ప్రపంచకప్ 2028కు ఆతిథ్యం దక్కించుకునేందుకు పలు ప్రధాన నగరాలు పోటీ పడుతున్నాయి. ప్రపంచకప్ ఆతిథ్యం కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు చెందిన 14 నగరాలు ఆసక్తి వ్యక్తం చేశాయి. అయితే టోర్నీ నిర్వహణ కోసం 8 నుంచి 10 వేదికలను మాత్రమే ఎంపిక చేసే అవకాశముందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వర్గాలు పేర్కొంటున్నాయి.

స్టేడియాల సామర్థ్యం, మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, అభిమానులకు అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఐసీసీ తుది జాబితాను ఖరారు చేయనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో, ఎంపికయ్యే వేదికలపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే తుది వేదికల జాబితాను ఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది.