CM Revanth | చెక్ డ్యాంలు కూలిపోతున్నాయి..

CM Revanth | చెక్ డ్యాంలు కూలిపోతున్నాయి..

  • విజిలెన్స్ విచారణ ఏమైంది..?
  • సీఎంకు కేంద్ర మంత్రి బండి బహిరంగ లేఖ

CM Revanth | కరీంనగర్, ఆంధ్రప్రభ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాంలు కూలిపోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)కి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో చెక్ డ్యాంలు(check dams) కూలిపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.

తనుగుల- గుంపుల వద్ద చెక్ డ్యాం కూలడమే ఇందుకు నిదర్శనమని ఆరోపించారు. బీఆర్ఎస్(BRS) పాలనలో కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతను గాలికొదిలేయడంవల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. చెక్ డ్యాంల నిర్మాణం, నిధుల చెల్లింపులపై మీరు ఆదేశించిన విజిలెన్స్ విచారణ ఏమైంది..? అని సీఎంను ప్రశ్నించారు.

ఆనాడే బాధ్యులపై చర్యలు తీసుకుని దిద్దుబాటు చర్యలు చేపడితే తనుగుల- గుంపుల(Tanugula-Groups) చెక్ డ్యాం కూలేది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే చెక్ డ్యాంల నిర్మాణాల్లో అక్రమాలు, కూలిపోవడంపై విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.