48 crores 89 lakhs | మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..!

48 crores 89 lakhs | మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..!

48 crores 89 lakhs | కురవి, ఆంధ్రప్రభ : మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్(Dr. Ramchander Naik) అన్నారు. ఈ రోజు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. కురవి, కందికొండ, చింతపల్లి, కురవి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ ప్రారంభం, ఇందికా మహిళ చీరల(Indira Women’s Sarees) పంపిణీ కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం(State Govt) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళల ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం కోసం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలతో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు. వడ్డీ లేని రుణాలు రూ. 48 కోట్ల 89ల‌క్ష‌లు(Rs. 48 crores 89 lakhs) ముప్పై తొమ్మిది వేల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. రైతులు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే తమ ధాన్యాన్ని విక్రయించి ప్రయోజనం పొందాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డీసీఓ వెంకటేశ్వర్లు, కురవి సీరోలు, తహసిల్దార్ పున్నం చందర్, విజయ, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, అంబటి వీరభద్రం, బానోత్ తుకరం నాయక్, అధికారులు, రైతులు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply