భవన పనులు త్వరగా పూర్తి చేయాలి

భవన పనులు త్వరగా పూర్తి చేయాలి
- ఎంపీడీవో పరిశీలన
జైనూర్, ఆంధ్రప్రభ:
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని దుబ్బగూడ గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణ పనులను బుధవారం మండల పంచాయతీ అధికారి భూఖ్య శశి కుమార్, దుబ్బగూడ సర్పంచ్ మడావి కౌసల్య భీమ్రావుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామపంచాయతీ భవన నిర్మాణంలో నాణ్యతకు ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని తెలిపారు.
అలాగే పంచాయతీ రికార్డులను పరిశీలించారు. పనుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
