రాజ్యసభ సభ్యుడిగా నరేందర్ రెడ్డి ఎన్నికపై హర్షం…

రాజ్యసభ సభ్యుడిగా నరేందర్ రెడ్డి ఎన్నికపై హర్షం…
సీఎం సలహాదారుతో అమరేందర్ రెడ్డి భేటీ
నల్లమల్ల సమస్యలు, ప్రవాస భారతీయుల ఇబ్బందులపై చర్చ
అచ్చంపేట, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని సీఎం ప్రవాసీ ప్రజావాణి రాష్ట్ర కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లమల్ల ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి చర్చించారు. ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా అమరేందర్ రెడ్డి వివరించారు. యుద్ధ పరిస్థితుల వల్ల ఇబ్బందులకు గురైన తెలంగాణ వాసుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని వివిధ దేశాల్లో హోటళ్లు, షెల్టర్లలో ఆశ్రయం కల్పించి ఆదుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రవాస తెలంగాణ ప్రజల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు.
